Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెపాలనపై అవగాన.!

పల్లెపాలనపై అవగాన.!

- Advertisement -

త్వరలోనే సర్పంచ్లకు శిక్షణ
నవతెలంగాణ – మల్హర్ రావు

దాదాపు రెండేళ్ల తర్వాత పంచాయతీ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇందులో భాగంగా ఎన్నికైన నూతన సర్పంచ్లకు పల్లెపాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.తదనుగుణంగా ఆ శాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 50 మంది చొప్పున ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వను న్నారు. ఇందుకోసం వివిధ స్థాయిల్లోని 8 మంది అధికారులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్ లో శిక్షణ పొందిన అనంతరం జిల్లాలో ఈ నెల 21 నుంచి 28వరకు రైతు వేదికల్లో సర్పంచ్లకు శిక్షణనివ్వనున్నారు. శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించేందు కోసం జిల్లాకు పత్యేకంగా ఓ లైజన్ అధికారిని నియమించినట్లుగా తెలుస్తోంది.

పంచాయతీరాజ్ అధికారులను ట్రైనర్ ఆఫ్ ట్రైనింగ్ (టీఓటీ) లుగా ఎంపికచేశారు.ఇందులో డీఎల్పీలు,ఎంపీడీవోలు, ఎంపీవోలతో పాటు మరో ఇద్దరు ఏపీడీలు ఉన్నారు.వీరంతా ఈ నెల 5 నుంచి 9వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని గ్రామీణాభివృద్ధి సంస్థకు చెందిన కేంద్రంలో రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందనున్నారు.ఐదు రోజుల శిక్షణ అనంతరం వారు జిల్లాకు చేరుకుని సర్పంచ్లకు శిక్షణ ఇస్తారు.

విధులు, బాధ్యతలపై శిక్షణ..

నూతన సర్పంచ్లకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం పంచాయతీ అధికారాలు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే గ్రామసభలు,పంచాయతీ సమావేశాల నిర్వహణను వివరించనున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యంపై అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వినియోగం, చేపట్టనున్న పనులు, పన్నుల వసూళ్లు, జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం అమలు, ఉపాధి అవకాశాలు ఆర్థి కాభివృద్ధిలో పంచాయతీల పాత్ర, వ్యవసాయం, సేంద్రియ సాగు, ఈ అప్లికేషన్,జనన,మరణాల నమోదు వంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -