ఎమ్మెస్కె ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వంలో బాలకృష్ణ మహా రాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మహారాణా మాట్లాడుతూ, ‘వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు. ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది’ అని తెలిపారు. ‘ప్రేమ, పగ, తప్పు-ఒప్పు, మంచి-చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హర్రర్ థిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందించాం.
కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం నాలుగు భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని డైరెక్టర్ సంజీవ్ మేగోటి చెప్పారు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ,’డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశాను. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ చేశాను. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది’ అని అన్నారు.
భిన్న హర్రర్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



