ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా ఇన్స్పెక్టర్ వి విజయ్ రామ్ కుమార్
మనమందరం సైనికులం – డ్రగ్స్ పై యుద్ధం చేయాలి
బోనకల్ ఎస్ఐ పొదిలి వెంకన్న
మాదకద్రవ్యాల వినియోగము వలన జీవితాలు నాశనం
మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి
నవతెలంగాణ – బోనకల్
మాదకద్రవ్య రహిత తెలంగాణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి విజయ్ రామ్ కుమార్ అన్నారు. మనమందరం సైనికులమై డ్రగ్స్ పై యుద్ధం చేయాలనే బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వలన మన జీవితాలను నాశనం అవుతాయని మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి అన్నారు. ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా, బోనకల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయము నందు మాదకద్రవ్యాల వినియోగం వలన జరిగే పరిణామాల పై మంగళవారం అవగాహన సదస్సును బోనకల్ సర్పంచ్ బానోత్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. మోటమర్రి లో సర్పంచ్ మర్రి సురేష్ ముష్టికుంట్లలో సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు కలకోటలో పైడిపల్లి అనిత అధ్యక్షతన కూడా అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సదస్సులో ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా ఇన్స్పెక్టర్ వి విజయ్ రామ్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వలన కొన్ని వందల జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవడానికి కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు అంటే ఏమిటి పోషకాలు లేదా శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలు కాకుండా ఒక జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిపై జీవక్రియ ప్రభావం చూపే ఏ రసాయన పదార్థానైనా డ్రగ్ అంటారని తెలిపారు. ఈ డ్రగ్స్ ఉన్న పేల్చడం ఇంజక్షన్ ద్వారా తీసుకోవడం పొగతాగటం మింగటం చర్మంపై ప్యాచ్ ద్వారా గ్రహించటం సపోజిటరి లేదా నాలుక కింద కరిగించుకోవడం వంటి వివిధ మార్గాల ద్వారా సేవిస్తున్నారన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు.
ప్రధానంగా యువత వీటికి బానిసగా మారుతున్నారన్నారు. సైకో యాక్టివ్ డ్రగ్స్ అనేవి కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపి అవగాహన మానసిక స్థితి స్పృహను మార్చే పదార్థాలని తెలిపారు. డ్రగ్స్ వాడే వ్యక్తులు మానసిక అస్థిరతకు గురై అది హింసకు దారితీస్తుంది అని తెలిపారు పిల్లల కూడా డ్రగ్స్ బారిన పడటం ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన విషయం అన్నారు.
మాదకద్రవ్యాలు మన వర్తమానాన్ని దెబ్బతీసి మన భవిష్యత్తును నాశనం చేస్తానని ఎస్ఐ పొదిలి వెంకన్న అన్నారు. మాదిగ ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను కుటుంబాలను సమాజాన్ని బలహీన పరుస్తుంది అన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు వచ్చి మాదగద్రవ్యాల నుండి తెలంగాణను రక్షించడానికి ఐక్యంగా ముందుకు నిలబడాలని కోరారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి స్నేహితులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారన్నారు. డ్రగ్స్ వాడటానికి నిరంతరం ఏదైనా ప్రైవేట్ లేదా రహస్య స్థానం కోసం వెతుకుతుంటారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రధానంగా యువత దీనికి బానిసగా మారుతుందని ఇందులో తల్లిదండ్రుల వైఫల్యం కూడా అక్కడక్కడ కనిపిస్తుందన్నారు.
డ్రగ్స్ ఒక వ్యసనామని, కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే నాశనం చేయదని ఆ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుందని మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి అన్నారు. డ్రగ్స్ దారిలోకి వెళ్లే ముందు తల్లిదండ్రులు తోబుట్టువులు స్నేహితులు గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. ఎంపీడీవో రురావత్ రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, సర్పంచ్ బానోత్ జ్యోతి, ఉప సర్పంచ్ బానోతు కొండ, మాజీ సర్పంచ్టి కో వెంకటేశ్వర్లు మాజీ సొసైటీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా బోనకాలు ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
అనంతరం బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే మానవహారం నిర్వహించారు. సందర్భంగా డ్రగ్స్ కి దూరంగా ఉంటాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మధిర డిప్యూటీ డిఆర్ఓ నిమ్మతోట వెంకటలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పంతంగి రమాదేవి, హెల్త్ సూపర్వైజర్ టి స్వర్ణ మారతమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, బోనకల్, ముష్టికుంట్ల, కలకోట, మోటమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

hdrForward: 6; shaking: 0.014931; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0017,0.0000;
brp_del_sen: 0.1500,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.65722203, 0.51775);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 41;



