Thursday, October 16, 2025
E-PAPER
Homeసినిమా'సఖి' లాంటి ఫ్యామిలీ సినిమా

‘సఖి’ లాంటి ఫ్యామిలీ సినిమా

- Advertisement -

‘లవ్‌ టుడే, డ్రాగన్‌’ వంటి రెండు వరుస హిట్స్‌ తరువాత హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్యూడ్‌’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రదీప్‌ సరసన మమిత బైజు నటించగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ మీడియాతో ముచ్చటించారు. ఇది డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. బ్యూటీఫుల్‌ మూమెంట్స్‌ ఉంటాయి. అలాగే ఎమోషనల్‌ మూమెంట్స్‌ కూడా ఉంటాయి. మనం సెకండ్‌ హాఫ్‌ గెస్‌ చేస్తుంటాం. కానీ ఈ సినిమా గెస్సింగ్‌కి భిన్నంగా ఉంటుంది. మంచి క్వాలిటీ సినిమా చూసిన ఫీలింగ్‌ ఉంటుంది డైరెక్టర్‌ చెప్పిన కథ కంటే 20% ఎన్‌హాన్స్‌ చేసి తీశారు. సాంగ్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుందనే కాన్ఫిడెన్స్‌ ఉంది. ఇది ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ.

ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమాలు ఎంటర్టైనింగ్‌గా, యూత్‌ఫుల్‌గా ఉంటాయి. ఆకోవలో ఉండే మరో అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. ఈ దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. లాస్ట్‌ టైం కూడా మూడు సినిమాలు వచ్చాయి. ‘అమరన్‌, లక్కీ భాస్కర్‌, క..’. ఈ మూడు సినిమాలు కూడా బాగా ఆడాయి. మేము ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌లో ఉన్నాం. అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాము. మేము అందరి హీరోలతోనూ పని చేస్తున్నాము. అందరి సినిమాలు కూడా అద్భుతంగా ఆడి, థియేటర్స్‌ కళకళలాడాలని మనస్పూర్తిగా కోరుకుంటాం. రామ్‌చరణ్‌తో చేస్నున్న ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్‌ చేస్తాం. ‘పెద్ది’ షూటింగ్‌ పూర్తి అవ్వగానే సుకుమార్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది. రామ్‌ పోతినేనితో చేస్తున్న ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా చాలా బాగా వచ్చింది. రామ్‌కి ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. డెఫినెట్‌గా చాలా బాగుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -