‘కలర్ ఫొటో, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం ఈనెల 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మురళీకాంత్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. సమాజంలోని అసమానతల మీద కథ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కమ్యూనిటీ వైజ్‌గా, రిలీజియస్ వైజ్‌గా కొంత మందికి భూమిని కేటాయిస్తారని నాకు అంతగా తెలీదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథను రాసుకున్నాను.
‘బలగం’లో వ్యక్తి చనిపోయిన తరువాత జరిగే పిండ ప్రధానం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత నుంచి పూడ్చి పెట్టే వరకు జరుగుతుంది. క్రిమేషన్‌తో ఈ చిత్రం ఎండ్ కార్డ్ పడుతుంది. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా అన్నదే కథ. ఇందులో అన్ని పాత్రలు శివాజీ కారెక్టర్‌కు లింక్ అయి ఉంటాయి. బిందు మాధవి పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఉమెన్ పాత్ర. ఈ చిత్రంలో నిర్ణయాలన్నీ మహిళ పాత్రలే తీసుకుంటాయి. మార్క్ కె రాబిన్‌మ్యూజిక్, ఆర్‌ఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆర్‌ఆర్ అందరినీ కదిలిస్తుంది. ఈ సినిమా, దీనిలోని స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఓ అందమైన మంచి అనుభూతితో థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వస్తారు.
మంచి అనుభూతినిచ్చే ‘దండోరా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



