‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. స్నేహ మణిమేగలై హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది.
అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసు దేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. అందమైన లవ్‌స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రం నుంచి ‘ఇది ప్రేమ..’ సాంగ్‌ను అగ్ర కథానాయిక సమంత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
అనంతరం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ,’నేను రెహమాన్ మ్యూజిక్ స్కూల్‌లో చదివాను. ఇది నా ఫస్ట్ మూవీ. మా ప్రొడ్యూసర్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి పాటలకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు.
మా డైరెక్టర్ నాతో సాంగ్స్ మాత్రమే కాదు లిరిక్స్ కూడా రాయించుకున్నారు. యాక్టర్స్‌తో డైలాగ్స్ రాయిం చారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
‘నందినీరెడ్డి నేను ప్రొడ్యూసర్ కావాలని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే అల్లు అరవింద్, విద్య అక్కకు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు నాకు ఎంతో సపోర్ట్ అందించారు. శ్రీకాంత్ ఎంతో ప్రతిభా వంతంగా మూవీని రూపొందించాడు. హర్షిత్, స్నేహ తమ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు’ అని ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి చెప్పారు. ప్రొడ్యూ సర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ,’ఈ కథ విన్నప్పుడు ఇది ప్రతి తెలుగు అబ్బాయి ఎమోషన్, మీ, నా ఎమోషన్ అనిపించింది. అలాగే ప్రతి తెలుగు అబ్బాయి పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ,’వసంతకోకిల, తొలి ప్రేమ, 7జి బందావన్ కాలనీ వంటి మూవీస్ వెంటనే గుర్తొస్తాయి. ఇప్పుడున్న యూత్ ఫ్యూచర్‌లో ఈ మూవీని గుర్తుతెచ్చుకుంటారు. అలాంటి బ్యూటిఫుల్ మూవీ ఇది’ అని అన్నారు.
అందరి మనసుల్ని తాకే.. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



