జాతరకు ముందే పోటెత్తిన జనం
కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రాంగణం ఆదివారం భక్తులు, పర్యాటకులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండగ సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి పిల్లాపాపలతో జనం తరలి వచ్చి గద్దెలను దర్శించుకున్నారు. ఆదివాసి ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక మొక్కులు, పసుపు కుంకుమ బంగారం (బెల్లం) చెల్లించుకున్నారు. దీంతో మేడారం పరిసరాలు భక్తుల రద్దీతో కోలాహలంగా మారాయి. అనంతరం అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. జాతరకు ముందే సందడి సందడిగా మేడారం పరిసరాలు మారిపోయాయి. సుమారు లక్ష మంది వరకు వచ్చి ఉన్నారని అధికారులు తెలిపారు.
వాహనాలతో ట్రాఫిక్ జామ్
ఆదివారం సెలవుదినం కావడంతో జనం ఆర్టీసీ, ప్రవేటు వాహనాలలో మేడారానికి తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మేడారం నుంచి తాడ్వాయి మార్గమధ్యలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్లపూర్ నుంచి కాల్వపల్లి క్రాస్‌రోడ్, కొత్తూరు జంపగవాయి, ఊరటం స్థూపం వరకు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణతో క్రమబద్ధీకరించారు.
మేడారంలో కోలాహలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



