అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్‌గా, గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘బూకి’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ మీడియాతో ముచ్చటించారు.
ప్రతి లవ్‌స్టోరీలో కథ ప్రేమతోనే మొదలవుతుంది. కానీ ఈ కథ మాత్రం బ్రేకప్‌తో మొదలవుతుంది. బ్రేకప్ తర్వాత ఇప్పటి టీనేజర్స్ ఎలా సఫర్ అవుతున్నారు?, ఎలాంటి డిప్రెషన్‌కి వెళ్తున్నారు?, ఆ బాధను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. పేరెంట్స్‌కి కూడా ఇది చాలా మంచి మెసేజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎంత స్పీడ్‌గా ప్రేమలోకి వెళ్తున్నారో, అంత స్పీడ్‌గా విడిపోతున్నారు. అప్పుడు ఎదురయ్యే బాధ ఎలా ఉంటుంది?, వాళ్ళని సరిగ్గా గమనించి మళ్లీ రైట్ ట్రాక్‌లోకి ఎలా తీసుకురావాలనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇందులో ఉంటుంది. ఈనెల13న ఈ సినిమా తమిళంలో రిలీజై, అద్భుతంగా ఆదరణ పొందింది. నిర్మాతలుగా చాలా హ్యాపీగా ఉన్నాం.
సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో రిలీజ్ కావడం చాలా అనందంగా ఉంది. దాదాపు 200కు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. విజయ్ ఆంటోని అసోసియేషన్‌లో మేం ‘మార్గాన్, భద్రకాళి’ సినిమాలు చేశాం. ఇప్పుడు ఈ సినిమా వస్తోంది. అలాగే ‘వందదేవుళ్ళు’ సినిమా చేస్తున్నాం. అజయ్ అద్భుతంగా నటించాడు. అలాగే హీరోయిన్ ధనుషా కూడా. డైరెక్టర్ డీవోపీ కావడంతో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్. ఈ నలుగురు ఈ సినిమాకి నాలుగు పిల్లర్స్. అలాగే ఇందులో విజయ్ ఆంటోని అతిథి పాత్రలో సర్‌ప్రైజ్ చేస్తారు. క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. సీన్స్ అన్ని అంత అద్భుతంగా వచ్చాయి. సత్యదేవ్ తో ఒక సినిమా పూర్తయింది. అది తొందరలోనే రిలీజ్ చేస్తాం. అలాగే ‘100 దేవుళ్ళు’ సినిమా మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



