నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ దృవ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని ఈనెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా.ప్రకాష్ ఆమ్టే, డా.మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని ‘సీతా పయనం’ టీమ్ సత్కరించి, లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ, ‘నా కూతురిని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జోనర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను.
జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అభి పాత్రలో అద్బుతంగా నటించాడు. నా కూతురి గురించి నేను కాకుండా ఆడియెన్స్ చెప్పాలి. ఈ చిత్రంలో ఐశ్వర్యను చూసి అందరూ మెచ్చుకుంటారని భావిస్తున్నాను. సత్య రాజ్ నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఫాదర్ అండ్ డాటర్ ట్రాక్, ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇందులో చాలా గొప్పగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ పాత్రను అందరూ ఇష్టపడుతారు. నేను, దృవ ఇద్దరం కేమియో పాత్రల్ని చేశాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఆర్‌ఆర్ ఈ చిత్రానికి ప్రధాన బలం. నా ఏడీ మూర్తి ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. మూర్తి, నేను కలిసే ఈ సినిమాని చేశాం. కెమెరామెన్ బాల కుమారన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సున్నితమైన అంశాలతో తెరకెక్కించినా కూడా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మేం హృదయంతో తెరకెక్కించాం. బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
బంధాల విలువను చాటి చెప్పే చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



