Saturday, October 25, 2025
E-PAPER
Homeసినిమాఅడవి నేపథ్య ప్రేమకథ

అడవి నేపథ్య ప్రేమకథ

- Advertisement -

హీరో రోషన్‌ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘సయ్యారే’ను మేకర్స్‌ విడుదల చేశారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించారు. ఈ సినిమా డిసెంబర్‌ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ,’మంచి సినిమా తీసిన సందీప్‌కి శుభాకాంక్షలు. కాలభైరవ మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ‘సయ్యారే’ పాట చాలా బాగుంది’ అని అన్నారు.

‘రోషన్‌ తొలి సినిమా ‘బబుల్‌ గమ్‌’ని మేమే ప్రజెంట్‌ చేశాం. ఈ సినిమా చాలా పెద్ద స్పాన్‌ ఉంటుంది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే లవ్‌ స్టోరీ ఇది’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు. హీరో రోషన్‌ కనకాల మాట్లాడుతూ, ‘కాలభైరవ ఈ పాటని చాలా ప్రేమతో, కసితో చేశాడు. సందీప్‌ అద్భుతంగా తీశారు’ అని తెలిపారు. ‘చాలా మంచి సినిమా తీశాం. ఈ పాట మీకు నచ్చితే దానికి పది రెట్లు సినిమా నచ్చుతుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌ చెప్పారు. నిర్మాత కృతిప్రసాద్‌ మాట్లాడుతూ, ‘సయ్యారే..’ నా ఫేవరెట్‌ సాంగ్‌. కాలభైరవ అద్భుతమైన సాంగ్‌ ఇచ్చారు. ఇది హార్ట్‌ ఆఫ్‌ ది ఫిలిం. రోషన్‌, సాక్షి అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -