నవతెలంగాణ – మోర్తాడ్
కార్మికులతో పెట్టుకున్న ఈ ప్రభుత్వం నిలకడగా నిలబడిన దాఖలాలు లేవని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంత మోర్తాడ్ సంయుక్త మండల కార్యదర్శి కిషన్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ విధానాలకు కూలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులు అనేక సంవత్సరాలకు కొట్లాడు తెచ్చుకున్న 44 చట్టాల్ని పెట్టుబడిదారుల కోసం నాలుగు కూడలిగా మార్చుతూ ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్కు దాసోహం చేస్తున్నారని అన్నారు. కార్మికుల తో పెట్టుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలుస్తాయని అన్నారు.
రైతంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా పెట్టుబడుదారుల లాభాల కోసం విద్యుత్ సవరణల బిల్లులను తీసుకువచ్చి రైతులను మోసం చేస్తున్నారని , దేశంలో ఉపాధి అవకాశాలు లేక పరిశ్రమలు మూతపడుతున్నప్పటికీ వాటికీ సహాయ సహకారాలు అందించకుండా కార్పొరేట్ రంగానికి దాసోహం పడుతున్నారని అన్నారు. మండల తాసిల్దార్ కార్యాలయం నుండి జాతీయ రహదారి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్య అక్క, దశరథ్ ,గంగు, రాజమణి, లింగు తదితరులు పాల్గొన్నారు.



