Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానోత్సవం

టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వనపర్తి టిఎన్ జివో భవనంలో మంగళవారం సాయంత్రం అభినందన సన్మానసభ జరిగింది. టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో జిహెచ్ఎంలుగా పదోన్నతి పొదిన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో పాటు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. రవి ప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, రిటైర్డ్ వండల విద్యా అధికారి కే.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధ్యయన, పోరాటం,సామాజిక స్పృహ లక్ష్యంతో టిఎస్ యుటిఎఫ్ పనిచేస్తుందని, నాణ్యమైన విద్యావ్యవస్థ కోసం పోరాడుతుందని అన్నారు.

వృత్తితోపాటు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి కే. శేఖర్, పాన్ గల్ యంఈఓ,బి. శ్రీనివాసులు శ్రీరంగాపూర్ ఎంఈఓ టి.హనుమంతు, టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు కే. జ్యోతి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎ. శివాజీ,జె. బాలస్వామి, వేణాచారి, వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్,నాయకులు టి.తిమ్మప్ప, పి.శ్రీనివాస్ గౌడ్, చిరంజీవి, అయోధ్య రాముడు,జి.హామీద్,అరుణ, అశ్విని,జి.మురళి,అగ్రిప్ప, రియాజ్, సూరయ్య,డి, రాముడు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad