నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రాజ్యసభ సభ్యుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి. నా.రె ) జయంతి కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు ఎనలేనివని అతనికి జ్ఞానపీఠ పద్మభూషణ్ పద్మశ్రీ నంది పురస్కారాలు వరించాయని తెలుగు భాష సాహిత్యానికి సాంస్కృతిక అభ్యుదయానికి గొప్ప కవిగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని సిరిసిల్ల జిల్లా రెడ్డి బిడ్డలుగా చాలా గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లారెడ్డి సంఘము ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి,గుల్లపల్లి నరసింహారెడ్డి , ఏడమల హనుమంత రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి,గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఎడ్మల భూపాల్ రెడ్డి, యేసురెడ్డి రామిరెడ్డి,వెలుముల తిరుపతి రెడ్డి,కుంభాల మల్లారెడ్డి ఉమా రెడ్డి సత్యనారాయణ రెడ్డి సింగిరెడ్డి రవీందర్ రెడ్డి మిట్టపల్లి జవహర్ రెడ్డి రాగి పెళ్లి కిష్టారెడ్డి లు పాల్గొని నివాళులు అర్పించి అందరూ ఆయన బాటలో నడవాలని కోరారు.