- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రామగిరి శర్మను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలలో భాగంగా ఉత్తమ దేవాలయ అర్చకుడిగా సత్కరించిన విషయం తెలిసిందె. ఈ సందర్భంగా శనివారం ఆలయ ఈఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కలిసి రామగిరి శర్మను ఘనంగా సన్మానించారు. వారి సేవలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



