Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విగ్రహ దాతలకు ఘన సన్మాం..

విగ్రహ దాతలకు ఘన సన్మాం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి ఋషి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో విగ్రహ స్థాపన కోసం ఆగస్టు 21న తేదీని కుల సంఘం పెద్దలంతా నిర్ణయించారు. ఆలయంలో విగ్రహ దాతగా నాందేవ్ మేస్త్రి ముదిరాజ్ ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కోసం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా సంతోష్ మేస్త్రి ముదిరాజ్ రూ.65 వేలు విరాళంగా ప్రకటించారు. ఇద్దరు మేస్త్రీలు ముందుకు రావడం, ఒకరు విగ్రహ దాతగా మరొకరు భారీ విరాళ దాతగా నిలవడంతో ముదిరాజ్ కుల సంఘం పెద్దలు ఆ ఇద్దరి దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం శాలువలతో ఘనంగా సత్కరించారు. కుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఇద్దరు మేస్త్రీలు ముందుకు రావడం అభినందనీయమని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కల్లూరు వార్ అశోక్, ఉపాధ్యక్షులు ఎంజపువార్  సాయిలు చిన్న, ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు ఏఎంసీ కార్యాలయంలో సూపర్వైజర్ గా విధులు నిర్వహించే ఎంజప్ వార్ చందర్, కుల సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad