Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘన విజయం ఖాయం

ఘన విజయం ఖాయం

- Advertisement -

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
తాజాగా మేకర్స్‌ కర్నాటకలో జరిగిన భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరై, ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,’ఇది కేవలం తెలుగు సినిమా కాదు. కన్నడ సినిమా కాదు.. ఇది పాన్‌ ఇండియా సినిమా. యువత మంచిదారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు చూస్తారు. బోయపాటితో నాకు ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. నిర్మాత గోపి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. తమన్‌ థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్‌ ఇచ్చారు.

ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ని మళ్ళీ ఇక్కడే జరుపుతాం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హిట్‌ కొడుతున్నాం’ అని తెలిపారు. ‘మా బ్రదర్‌ బాలయ్య ‘అఖండ 2′ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఒకే కుటుంబం. మేమిద్దరం బ్రదర్స్‌ లాగే ఉంటాము. బాలయ్య నటన, డైలాగులు, యాక్షన్‌లో ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు’ అని శివరాజ్‌ కుమార్‌ చెప్పారు. డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ,’ఇది శివతత్వంతో ఉన్న అద్భుతమైన సినిమా. శివన్న చేతుల మీదగా ఈ ట్రైలర్‌ని లాంచ్‌ చేయడం మేము చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాం’ అని తెలిపారు. ఆది పినిశెట్టి, హీరోయిన్‌ సంయుక్త, నిర్మాత గోపి ఆచంట తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -