నవతెలంగాణ- రాయపోల్
ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన గ్రామాలలో సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఎన్నికలు రాగానే ఏలాంటి సమస్య ఉన్న మేము చేస్తాం. మీ సమస్యలు మేమంటే మేము పరిష్కారం చేస్తామంటూ హామీలు ఇచ్చే నాయకులు ఎన్నికలు ముగియగానే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు షరామామూలుగానే సమస్యలు అలాగే ఉంటున్నాయి. రాయపోల్ మండలంలోని బేగంపేట- ఎల్కల్ గ్రామాల మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు గుంతలుగా మారి ఆ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే నరకయాతనలాగా మారింది.
ప్రజలు నాయకులు ఎన్నోసార్లు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఈ రోడ్డుకు మాత్రం మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పూర్తిగా అధ్వానంగమారి రెండు గ్రామాల మధ్య చెరువు కట్ట కింద కల్వర్టుపై నడిరోడ్డుపై గుంత పడడంతో గ్రామస్తులు ప్రయాణికులకు ప్రమాదం జరగవద్దని చెట్టుకొమ్మను పెట్టారు. బేగంపేట, అప్పాయిపల్లి గ్రామాల ప్రజలు గజ్వేల్ పట్టణానికి వెళ్లాలంటే ఈ రోడ్డు గుండనే ప్రయాణం చేయాలి. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు వాపోతున్నారు.
పొంచి ఉన్న పెను ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES