
ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలేశ్వరం జోనల్ కమిటీ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండలంలోని ఎడ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దావేరా సంధ్యారాణి మండల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై గోల్డ్ మెడల్, ప్రసంశా పత్రాన్ని అందుకున్న విషయం విదితమే. అయితే శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్ఎంసీ కమిటీ, గ్రామ ప్రజలు శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప బాపు , ఉపసర్పంచ్ రాజేశ్వరరావు ,ఎస్ఎంసి చైర్మన్ అశోక్ , పాఠశాల ఉపాధ్యాయులు డబ్ల్యూ అరుణ్ కుమార్ ,పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ , వార్డు సభ్యులు ఆక్కినవెని రాధ శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు జంగిడి శ్రీనివాస్, డాక్టర్ సమ్మయ్య, డాక్టర్ లక్ష్మి రాజు, బత్తుల బాణయ్య,సుమన్ పంతకాని వెంకట్ రాజు,ఇండ్ల అశోక్, కారోబార్ శ్రీకాంత్ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అభినందించారు