Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కు ఘన సన్మానం..

నీల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్  : రెంజల్ మండలం నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఫిజికల్ డైరెక్టర్గా సేవలను అందించిన నాంచారి శ్రీనివాస్ ఇటీవల బదిలీపై వెళ్ళారు. దీంతో ఆయనను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ శారద ప్రత్యేక చొరవతో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనంద్, ప్రవీణ్, సాయిబాబా, గులాం హైమద్, శారద, అపర్ణ, లావణ్య, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -