Friday, October 31, 2025
E-PAPER
Homeసినిమాప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేసే హై వోల్టేజ్‌ డ్రామా

ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేసే హై వోల్టేజ్‌ డ్రామా

- Advertisement -

రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. నవంబర్‌ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ మీడియాతో ముచ్చటించారు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్‌ ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ప్రేరణ ఇచ్చింది.
రష్మికకు స్క్రిప్ట్‌ పంపితే, రెండు రోజుల్లోనే స్క్రిప్ట్‌ మొత్తం చదివి, ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్‌కు చెప్పాలి, ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్‌ అయ్యాను.

బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్‌ హగ్‌ ఈ సినిమా అని చెప్పింది. అలాగే ఈ మూవీలోని విక్రమ్‌ క్యారెక్టర్‌కి దీక్షిత్‌ బాగుంటాడు అనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా తన క్యారెక్టర్‌కు పర్పెక్ట్‌గా సెట్‌ అయ్యింది. ఇందులో నేనూ లెక్చరర్‌గా కనిపిస్తా (నవ్వుతూ). హేషమ్‌ అబ్దుల్‌ వాహాబ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఆయన మ్యూజిక్‌తో మూవీలోని ఫీల్‌ మరింత పెరిగింది.
ట్రైలర్‌లో ఉన్న హై వోల్టేజ్‌ ఇంటెన్స్‌ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుంది. ఈ డ్రామా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఒక జంట లైఫ్‌లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. ఇంటెన్స్‌ ఎమోషన్‌ ఉన్న లవ్‌ స్టోరీని రియలిస్టిక్‌ అప్రోచ్‌లో చేశాం. నెక్ట్స్‌ నేను డైరెక్ట్‌ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్‌ ఓకే అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక, నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -