Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబోడుప్పల్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

బోడుప్పల్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

– ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ను ఢకొీట్టిన కారు
– ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతి
నవతెలంగాణ-బోడుప్పల్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన బోడుప్పల్‌ సర్కిల్‌లో విద్యార్థుల కారు అదుపు తప్పి ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ను ఢకొీట్టింది. దాంతో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా, మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. మేడిపల్లి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సాయివరుణ్‌, నిఖిల్‌, రాకేష్‌, వెంకట్‌ అభినవ్‌, సాత్విక్‌, హర్ష చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరందరూ ఘటకేసర్‌లోని పలు ప్రయివేటు యూనివర్సిటీలలో ఇంజినీరింగ్‌ చదువుతూ పోచారంలోని సద్భావనంలోని అపార ్‌్టమెంట్‌లో నివాసం ఉంటున్నారు. మంగళ వారం రాత్రి 9 గంటల సమయంలో మౌలాలి లో ఉన్న రాకేష్‌ వాళ్ల అన్న మదవ్‌ను కలిసేం దుకు అందరూ నిఖిల్‌ కారులో వెళ్లారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 2:20 గంటలకు పోచారం వెళ్తుండగా బోడుప్పల్‌ సర్కిల్‌లో కారు అదుపు తప్పి ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో 97వ నెంబర్‌ పిల్లర్‌ను ఢకొీట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న నిఖిల్‌(21)తో పాటు వెనుక కూర్చున్న సాయి వరుణ్‌(21) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌, వెంకట్‌తోపాటు అభినవ్‌, యశ్వంత్‌ను స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సాత్విక్‌, హర్ష స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

పది నిమిషాల ముందే డ్రైవింగ్‌ సిట్లోకి వచ్చి..
మౌలాలి నుంచి బయలుదేరినప్పుడు యశ్వంత్‌ కారు డ్రైవింగ్‌ చేశాడు. బోడుప్పల్‌ అంబేద్కర్‌ సర్కిల్‌కు చేరుకున్న సమయంలో నిఖిల్‌ డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చాడు. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరిగి ప్రాణం కోల్పోయాడు. గమ్యం చేరే వరకు యశ్వంత్‌ డ్రైవింగ్‌ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమోనని బంధువులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
కొడుకులు చదువుకుని ప్రయోజకులు అవుతారని కలలు కన్న తల్లిదండ్రులకు.. తమ కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. నిఖిల్‌ తండ్రి బాలకృష్ణ వనపర్తి కేంద్రంలో బిజినెస్‌ చేస్తుండగా, సాయి వరుణ్‌ తండ్రి రాజశేఖర్‌ ఆర్టీసీలో పని చేస్తున్నారు.

అతివేగమే కారణమా?
ప్రమాదానికి అజాగ్రత్త, అతివేగమే కారణమా ? లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మేడిపల్లి ఎస్‌ఐ ఉదరు భాస్కర్‌ తెలిపారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాత్రి సమయంలో ప్రయాణాలు, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని మేడిపల్లి సీఐ ఆర్‌.గోవింద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -