Wednesday, July 23, 2025
E-PAPER
Homeసినిమాక్రేజీ కాంబోలో భారీ సినిమా

క్రేజీ కాంబోలో భారీ సినిమా

- Advertisement -

అగ్ర దర్శకుడు జోషీ ఓ హై-ఒక్టేన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో మెగా ఫోన్‌ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఉన్ని ముకుందన్‌ ఫిలింస్‌ అండ్‌ ఐన్స్టిన్‌ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రాబోతుంది. డైరెక్టర్‌ జోషీ పుట్టినరోజునే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్‌ పవర్‌తో, ఒక భారీ యాక్షన్‌ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు.
నేషనల్‌ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్‌’ తర్వాత వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్‌తో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమాలతో యుఎంఎఫ్‌ స్టాండర్డ్‌ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు జోషీ లాంటి డైరెక్టర్‌తో చేతులు కలపడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అభిలాష్‌ ఎన్‌. చంద్రన్‌ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘పొరించు మరిఅమ్‌ జోస్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొథా’ వంటి సినిమాలకు రాసిన ఈయన ఎమోషన్‌, డెప్త్‌ ఉన్న క్యారెక్టర్‌లు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలుతో ఉండ నుంది. హీరోగా ఉన్ని ముకుందన్‌ తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఐన్స్టిన్‌ మీడియా ఇటీవలే ‘ఆంటోనీ’, ‘పురుష ప్రేతం’ వంటి యూనిక్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌, క్వాలిటీ కంటెంట్‌కి పేరు తెచ్చుకున్న ఈ బ్యానర్‌ కూడా ఈ సినిమాతో సత్తా చాటబోతోంది.
‘ఉన్ని ముకుందన్‌ ఫిలింస్‌ అండ్‌ ఐన్స్టిన్‌ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా బిగ్‌ పాన్‌-ఇండియా ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. ఇప్పటివరకు చూడని కథతోఈ సినిమా ఉంటుంది. అలాగే ఇందులోని ప్రతి పాత్ర మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని హీరో ఉన్ని ముకుందన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -