Sunday, February 15, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపాల్టీ ఎన్నికల్లో కీలక ఘట్టం

మున్సిపాల్టీ ఎన్నికల్లో కీలక ఘట్టం

- Advertisement -

– ఛైర్పర్సన్ ఎంపికకు కసరత్తు 
– అభ్యర్ధిని ఖరారు చేసే బాధ్యతల్లో ఎమ్మెల్యే జారె తలమునకలు
– క్యాంపు లోనే కౌన్సిలర్ లు పరోక్ష సమావేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపాల్టీ ఎన్నికల చివరి కీలక ఘట్టం వచ్చేసింది. ఛైర్పర్సన్ అభ్యర్ధిని ఖరారు చేసే బాధ్యతల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తలమునకలు అయ్యారు. సోమవారం ఛైర్పర్సన్ ఎంపిక కోసం మున్సిపల్ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విప్ బాధ్యత ల్లో ఉన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం లంబసింగి క్యాంపు లోనే 11 గంటల లోపు ఎన్నికైన కౌన్సిలర్ లతో అంతర్గత పరోక్ష సమావేశం ఏర్పాటు చేసి విప్ జారీ చేసారు.ముందస్తు ఒప్పందం ప్రకారం ఛైర్పర్సన్ అభ్యర్ధిని ఫలానా వారిని ప్రతిపాదిస్తున్నట్లు సమావేశంలో విప్ జారీ చేస్తారు.దానికి అంగీకరించినట్లు కౌన్సిలర్ సంతకాలతో కూడిన అధికారిక పత్రాన్ని ఎన్నికల అధికారికి అందజేస్తారు.

దీని ప్రకారం సోమవారం ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల అధికారి ముందు బీ ఫాం ప్రకారం ఛైర్పర్సన్ ను ఎన్నిక పూర్తి చేస్తారు. ఛైర్పర్సన్ గా ఎన్నికైన కౌన్సిలర్ ఉప చైర్మన్ ను ఒకరిని ప్రతిపాదిస్తూ తీర్మానం చేస్తారు.ఆ తీర్మానాన్ని కౌన్సిలర్ లు ఆమోదిస్తారు. దీంతో మున్సిపల్ ఛైర్పర్సన్ ,ఉప చైర్మన్ లు ఎంపిక పూర్తి అవుతుంది. అయితే సోమవారం ప్రత్యక్షంగా నిర్వహించనున్న ఛైర్పర్సన్ ఎన్నిక కోసం జరిగే పరోక్ష సమావేశాలు అన్ని లంబసింగి లోని రిసార్ట్స్ లో ఆదివారం మే పూర్తి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -