Monday, September 15, 2025
E-PAPER
Homeసినిమాతల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా

తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా

- Advertisement -

అంకిత్‌ కొయ్య, నీలఖి హీరో, హీరోయిన్లుగా విజరు పాల్‌ రెడ్డి అడిదల, ఉమేష్‌ కుమార్‌ భన్సల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్‌, మారుతీ టీం ప్రొడక్ట్స్‌, వానర సెల్యూలాయిడ్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి జె.ఎస్‌.ఎస్‌.వర్ధన్‌ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌.వి.సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. తాజాగా మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్‌ మారుతి, ఎస్‌కేఎన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూసిన తరువాత హీరో, హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. ఇది చాలా గొప్ప సినిమా. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. ఆడపిల్లల గురించి పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాటలతో, వాస్తవ సంఘటనలతో ఈ కథను రాశారు’ అని తెలిపారు.

‘వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ను ప్రారంభించలేదు. మంచి చిత్రాల్ని నిర్మించాలని ఇండిస్టీలోకి వచ్చాను. నేను తీసిన గత చిత్రం కూడా మంచిదే. ఓటీటీలోకి వచ్చిన తరువాత ఆ విషయం తెలుస్తుంది. ఈ మూవీ కూడా అందరికీ నచ్చుతుంది. సుబ్రమణ్యం ఇచ్చిన కథను వర్ధన్‌ అద్భుతంగా తీశారు. నరేష్‌, వాసుకి, అంకిత్‌.. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఈనెల 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని నిర్మాత విజరు పాల్‌ రెడ్డి అడిదల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -