ఆశిష్ హీరోగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ వరల్డ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఘన్ను భాయ్, అతని టీం దాదాపు ఏడు కిలోల డ్రమ్ములను మోస్తూ, గంటల తరబడి విరామం లేకుండా ప్రదర్శన ఇస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆ సంగీతం వెనుక కనిపించే ఆత్మగౌరవం, హుందాతనం ఉన్నాయి. ఈ గ్లింప్స్ ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా, శక్తివంతంగా ప్రజెంట్ చేసింది.
500 మందికి పైగా స్ట్రీట్ డ్రమ్మర్లు ఏకతాటిపై హోరెత్తిస్తూ, వాతావరణాన్ని ఎనర్జీని నింపేశారు. వారి ఉత్సాహభరితమైన పెర్ఫార్మెన్స్ ఈవెంట్ స్థాయిని పెంచడమే కాకుండా, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘ఈ కథ పుట్టడానికి కారణం ఆదిత్య. హైదరాబాద్‌లో ఉండే కల్చర్ ఫెస్టివల్స్ గురించి ఈ సినిమా. ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు గురించి తన లైఫ్‌లో చూసిన ఇన్సిడెంట్ అన్నింటిని ఘన్ను అనే క్యారెక్టర్‌తో ఒక కథ రాసుకొని హైదరాబాద్‌లో ఉండే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్.. ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. ఏడాదిగా ఆదిత్య, ఆశిష్ బ్యాండ్ వాయించే వాళ్ళు చుట్టూ తిరుగుతూ వాళ్ల గురించి తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్‌లో ఉండే ఇన్సిడెంట్ అన్ని పోగుచేసుకొని ఈ కథని ఫైనల్‌గా రాశారు. హైదరాబాద్ కల్చర్ ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్నారు’ అని అన్నారు.
‘ఒక ఏడాది క్రితం ఆదిత్య ఒక గ్లింప్స్ చూపించారు. అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. మన హైదరాబాద్ కల్చర్‌ని ఒక దేత్తడి రేంజ్‌లో చూపించడానికి వస్తున్నాం. సినిమా అద్భుతంగా తీశారని మీరు మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్రతి బ్యాండ్ గర్వపడేలా ఈ సినిమా తీస్తాం’ అని హీరో ఆశిష్ చెప్పారు. డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ,’ఈ సినిమా ముందుకెళ్లడానికి కారణం మా హీరో. ఆయనే మొదటగా కథని నమ్మారు. అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. మన పండగలు, మన పాటలు, మన హైదరాబాద్ కల్చర్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించాలని నా కోరిక. ఈ కథ, ఈ సినిమా నామీద ఒక బాధ్యతను పెంచింది. కచ్చితంగా మంచి సినిమాను తీస్తున్నాం. అందరికీ గుర్తుండిపోయే సినిమాను తీస్తాం’ అని తెలిపారు. ‘ఈ సినిమా వచ్చిన తర్వాత బ్యాండ్ ఆర్టిస్ట్ అనే గౌరవం తెచ్చేలాగా ఉంటుంది. ఇది అసలైన హైదరాబాద్ కల్చర్ చూపించే ఫస్ట్ సినిమా కాబోతోంది’ అని రైటర్ ప్రసన్న చెప్పారు.
హైదరాబాద్ కల్చర్‌ని ప్రపంచానికి చూపించే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



