Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతహసిల్దార్ కు తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం..

తహసిల్దార్ కు తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ -జుక్కల్ : జుక్కల్ తహసిల్దార్ కు కృతిలో ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ తాహసిల్దారుగా ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ కుమార్ మంగళవారం రెవెన్యూ సదస్సులకు హాజరయ్యేందుకు కామారెడ్డి నుండి జుక్కల్  మండలానికి  పెద్ద కొడప్ గోల్  మీదుగా వస్తున్న  క్రమంలో అంజనీ గేటు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ తాహసిల్దార్ కారును ఢీకొంది. వెంటనే తహసిల్దార్ ను ప్రభుత్వ ఆస్పత్రికి రెవెన్యూ సిబ్బంది తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img