ఇన్చార్జి తహసిల్దార్ హేమలత..
నవతెలంగాణ – జుక్కల్ : గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఇంన్చార్జ్ తాహసిల్దార్ హేమలత , ఆర్ ఐ రామ్ పటేల్ అన్నారు. మంగళవారం రెండవ రోజు రెవెన్యూ సదస్సులు జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామపంచాయతీలో ఆర్ ఐ రాంపటేల్, చిన్న గుల్లా గ్రామపంచాయతీలలో ఇంచార్జీ తహసిల్దార్ హేమలత పాల్గొని సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ.. గ్రామాలలో భూ వివాదాలు చీటికిమాటికి పెరిగిపోవడంతో వాటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తెలిపారు. అందులో భాగంగా గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ప్రజలు పాల్గొని తమ భూవివాద సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదులు, దరఖాస్తులను అందచేయాలని తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు తమ వంతుగా శ్యాయశక్తుల కృషి చేస్తామని ఈ సందర్బంగా వారు తెలిపారు. నిర్భయంగా ప్రజలు సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇక్కడ తెలియజేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వివేన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
- Advertisement -



