Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేత రంగంలో నూతన అధ్యాయం

చేనేత రంగంలో నూతన అధ్యాయం

- Advertisement -

సింగిడి కలెక్టివ్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన సింగిడి కలెక్టివ్‌ నూతన ఫ్యాషన్‌ బ్రాండ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ నేల స్వభావానికి అద్దం పట్టేలా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయ చేనేత నైపుణ్యంతో ఈ బ్రాండ్‌ రూపుదిద్దుకోవడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ ఎప్పుడూ కొత్త దనానికి వేదికగా నిలుస్తుందన్నారు. ఇక్కత్‌ నుంచి గొల్లభామ చీరల వరు నేతన్నల నైపుణ్యం అద్భుతమని అన్నారు. ఈ వారసత్వాన్ని నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా మార్చుతూ పర్యావరణానికి హాని లేని రీతిలో సింగిడి కలెక్టివ్‌ ముందడుగు వేయడం హర్షణీయమని చెప్పారు. వ్యాపారమే కాకుండా నేతన్నలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో యువత ఇటువంటి స్టార్టప్‌లను స్థాపించడం గర్వకారణమని అన్నారు. చేనేత రంగంలో ఇఇ నూతన అధ్యాయమని చెప్పారు. లింగ భేదం లేకుండా ఆధునిక డిజైన్లతో రూపొందిన ఈ వస్త్రాలు షషష.రఱఅస్త్రఱసఱషశీశ్రీశ్రీవష్‌ఱఙవ.షశీఎ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో సింగిడి కలెక్టివ్‌ వ్యవస్థాపకులు విశ్వసారథి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -