Thursday, October 30, 2025
E-PAPER
Homeసినిమాసర్‌ప్రైజ్‌ చేసే కొత్త పాయింట్‌

సర్‌ప్రైజ్‌ చేసే కొత్త పాయింట్‌

- Advertisement -

”మాస్‌ జాతర’లో మాస్‌ అంశాలుతోపాటు ఒక కొత్త పాయింట్‌ కూడా ఉంది. రైల్వే పోలీస్‌ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్‌ కొత్తగా ఉంటుంది. సీన్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్‌ప్రైజ్‌లు చూడ బోతున్నారు. రవితేజ 75వ చిత్రానికి దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే మొదట ఈ విషయం నాకు తెలీయదు. అయితే, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.

ఇందులో నవీన్‌ చంద్ర శివుడు అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’లో చిరంజీవి-విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్‌తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి. దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు’ అని దర్శకుడు భాను భోగవరపు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -