ఆయన పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది: మండల పార్టీ అధ్యక్షులు ధారాస్ సాయిలు.
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఉన్న గంగారం అనే వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్లో లేరని ఆయనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అశోక్ జమ్శెట్టి వార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు గ్రామ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్పంచ్ ను గెలిపించుకోవాలని తెలిపారు. అశోక్ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే వ్యక్తిని ఎలాంటి పనికైనా ముందుంటారని ఆయనను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. మేనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మేనూర్ తాజా మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు జుబ్రి సురేష్ గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గంగారం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో లేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


