Wednesday, July 16, 2025
E-PAPER
Homeసీరియల్సందేశాన్నిచ్చే 'పోలీస్‌ వారి హెచ్చరిక'

సందేశాన్నిచ్చే ‘పోలీస్‌ వారి హెచ్చరిక’

- Advertisement -

తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్‌ నిర్మించిన చిత్రం ‘పోలీస్‌ వారి హెచ్చరిక’. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర తొలి టికెట్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మట్టి కవి బెల్లి యాదయ్య హాజరై, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ,’ రెగ్యులర్‌గా వస్తున్న సినిమాలకు మా సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో నెగటివ్‌ క్యారెక్టర్ల మధ్య మంచి సన్నివేశాలు ఉండబోతున్నాయి. వారి మధ్య ప్రేమ, పాటలు ఉంటాయి. మా చిత్ర టైటిల్‌ ఇప్పటికే ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది. దానికి పోలీస్‌ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలుపుబోతున్నాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సమాజం మీద ఒక ప్రేమతో, బాధ్యతతో థియేటర్‌ నుండి బయటకు వెళ్తారు’ అని అన్నారు.
‘నేను ఆర్మీలో పని చేసి వచ్చాను. మంచి కంటెంట్‌తో ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించాను. మా దర్శకుడు బాబ్జీ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా తప్పకుండా జనాదరణ పొందుతుంది’ అని నిర్మాత బెల్లి జనార్థన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -