ప్రముఖ కళాదర్శకుడు తోట తరణికి ఓ అరుదైన గౌరవం లభించింది. ఫ్య్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘చెవాలియర్’కు ఆయన ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో ఈ పురస్కారాన్ని నేడు (గురువారం) ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడి ఉహను తన అద్భుతమైన కళా దర్శకత్వంతో వెండితెరపై మ్యాజిక్ చేయటంలో తోటతరణి తనకు తానే సాటి అని నిరూపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1978లో ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రంతో తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా ‘నాయకుడు, భారతీయుడు’ చిత్రాలకు రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. మూడు నంది అవార్డులు లభించాయి. 2001లో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో తరణిని సముచితంగా గౌరవించింది.
అరుదైన గౌరవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



