- Advertisement -
11వ వార్డ్ సభ్యుడు ముడుగు ప్రవీణ్..
నవతెలంగాణ జన్నారం
మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఈవోను నియమించాలని పంచాయతీ 11వ వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఏర్పాటుచేసిన పత్రిక విలేకరులతో వారు మాట్లాడుతూ, పొనకల్ పంచాయతీ ఈవో పోస్టు గత నాలుగు సంవత్సరాలుగా ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతుందన్నారు.
పొన్కల్ గ్రామ పంచాయతీ లో సుమారు 10వేల మంది ప్రజలు ఉన్నట్లు వారి యెక్క ప్రయోజనం దృష్టి లో పెట్టుకొని వారి సౌకర్యార్థం రెగ్యులర్ ఈఓ ను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
- Advertisement -



