బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ ఫుల్ ద్వయం తాజాగా నంది పాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
-ప్రొద్దుటూరు నా స్వస్థలం. ప్రస్తుతం నేను బెంగుళూరులో కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే కన్నడలో నిర్మాతగా ప్రవేశించాను. తెలుగులో నిర్మాతగా ఇది తొలి సినిమా.
-మా సంస్థలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత రమణా రెడ్డి ద్వారా ఈ కథ విన్నాను. ఈ కథ కంటే ముందు పది కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. ఈ కథ వినగానే ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండే సినిమా ఇది.
-సినిమాలో ఇంటర్వెల్, పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌లు, ఆడియన్స్ ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది.
-బన్నీవాస్, వంశీతో ట్రావెల్ వంశీ మొదట్నుంచీ ఉంది. వాళ్ల అసోసియేషన్‌తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. సత్యదేవ్ హీరోగా ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో నా తదుపరి సినిమా ఉంటుంది. లక్ష్మీ నారాయణ దర్శకుడు. అవుట్ అవుట్ అండ్ కమర్షియల్ మూవీ ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ నటిస్తారు.
మీ ఊహకు అందని స్క్రీన్‌ప్లే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



