పుష్కరాలను ప్రపంచానికి చాటి చెప్పారని పొగుడుతూనే అవమానాలు
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల వార్తలను బహిష్కరించే ఆలోచన
నవతెలంగాణ-భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రం కేంద్రంగా మే 15 నుండి 26 వరకు జరిగిన సరస్వతీ పురస్కారాల విజయోత్సవ సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ,ఎస్పి కిరణ్ ఖరే సమక్షంలో నిర్వహించిన విజయోత్సవ సన్మాన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులకు ,ఉద్యోగులకు జ్ఞాపకతో పాటు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ గత రెండు మూడు నెలల నుంచి కాలేశ్వరం కేంద్రంగా సాగుతున్న సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనుల మొదలుకొని పుష్కరాలు ముగింపు వరకు ప్రతి కార్యక్రమాన్ని విస్తృతంగా కవరేజ్ చేసిన జర్నలిస్టుల మాత్రము సన్మానానికి దూరం పెట్టారు. కేవలం జర్నలిస్టు మిత్రులు అని చెప్పి మంత్రితో ఫోటో దింపి వదిలేశారు. కనీసం పుణ్యక్షేత్రంలో రెండు,మూడు నెలల నుంచి జరుగుతున్న పుష్కరాల అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం కల్పించి, 12 రోజులపాటు సాగిన పుష్కరాల కవరేజిని రాత్రింబవళ్లు తేడా లేకుండా కవర్ చేసిన జర్నలిస్టులను మాత్రం మంత్రి, జిల్లా అధికార యంత్రాంగం విస్మరించారు. పుష్కర సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వం తమ వివక్షతను చాటుకుంది. చివరకు ఉద్యోగులకు, అధికారులకు, నాయకులకు అందించిన ఏ కార్యక్రమాన్ని కూడా జర్నలిస్టులకు వర్తింప చేయకపోవడం పై జిల్లా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో జర్నలిస్టులపై ప్రభుత్వ, అధికారుల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 15 ,జనవరి 26, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వ ఉత్తమ ఉద్యోగులతో పాటు ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు అందజేసింది . గతంలో ఈ మూడు విభాగాలలోను జర్నలిస్టు మిత్రులకు అవకాశం కల్పించేది. ఆ సత్కార్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం. ఎప్పటికప్పుడు మన జిల్లా కదా అని సర్దుకుపోతున్నప్పటికీ జర్నలిస్టులపై వివక్షత నానాటికి పెరిగిపోవడంతో రానున్న జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వార్తలను బహిష్కరించాలనే ఆలోచనలో జిల్లా జర్నలిస్టులు ఉన్నారు.
పుష్కర సన్మానంలో జర్నలిస్టులపై చిన్న చూపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES