కరెంట్ షాక్ తగిలి చికిత్స పొందుతూ సఫయి కార్మికుని మృతి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఎవరి పనులు వారు చేయక చిన్న తప్పుగా ఒకరి ప్రాణాన్ని బలిగొంది కార్మికునిగా పనిచేసే ఒక కార్మికుడు విద్యుత్ సరఫరా అవుతుండగానే స్తంభం పైకి ఎక్కి షాక్కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి తాండ గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ జి సందీప్, స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. ఈ నెల 21 న ఇందల్ వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సఫాయి పని చేస్తున్న ఎడపల్లి చిన్న సాయిలు (41) సఫాయి కార్మికుడు రోజువారి పనిలో భాగంగా ఇందల్ వాయి తాండా గ్రామపంచాయతీకి సఫాయి పని నిమిత్తం వెళ్ళాడు. గ్రామపంచాయతీ సెక్రెటరీ జాస్మిన్, కారోబార్ రామ్ చందర్ ఇద్దరు నిర్లక్ష్యంగా పంచాయతీ పరిధిలోని ఎలక్ట్రిక్ స్తంభాలకు వీధి దీపాలు పెట్టమని వారి ఉత్తర్వుల ప్రకారం.. మృతుడు ఎడపల్లి చిన్న సాయిలు కరెంటు స్తంభాలకు వీధి దీపాలు పెట్టుచుండగా 11 కెవి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయి ఛాతికి రెండు కాళ్లకు, తొడలకు కాలిన గాయాలయ్యాయి.
కాగా సాయిలు ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని మనోరమ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు శనివారం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి లో మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చరికి తరలించినట్లు ఎస్ సి హెచ్ జి సందీప్ పేర్కొన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి..
గ్రామపంచాయతీలో సఫై కార్మికునిగా పనిచేసే సాయిలు ను విద్యుత్ స్తంభాలు ఎక్కించి వీధి దీపాలు అమర్చాలని ఆదేశించిన పంచాయతీ కార్యదర్శి, కరోబార్ నిర్లక్ష్యం మూలంగానే ఒక నిండు ప్రాణం బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. అని విశ్వసించిన సమాచారం మేరకు కారోబార్ ఉన్న రామచందర్ కారోబార్ వీధులు నిర్వర్తిస్తూ గ్రామపంచాయతీ పరిధిలో వీధి దీపాలు కూడా అమర్త్య పని చేస్తూ ఉండేవాడని, గ్రామంలోని పలు స్తంభాలకు విద్యుత్ దీపాలు అమర్చడానికి సబ్ స్టేషన్ లో ఎల్ సి తీసుకున్నారని తర్వాత దాన్ని రిటర్న్ చేసినట్లు వారు వివరించారు. ఏదైతే స్తంభానికి షాక్ వస్తుందో ఆ స్తంభం పైకి రామచందర్ ఎక్కకుండా సాయిలును ఎక్కించడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.
మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో నేరుగా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయానికి తీసుకొని వచ్చారని ఎంపీడీవో అనంత్ రావు సాయిలు దాహన సంస్కరాల కోసం పదివేల రూపాయలను అందజేసినట్లు వివరించారు. ఏది ఏమైనా గ్రామపంచాయతీ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలిగొందని కుటుంబ సభ్యులు రోదించారు. సాయిలు నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు అధికారులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వాన్ని వేడుకున్నారు.