క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘పుష్ప, జైలర్’ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన సునీల్ ఈ ట్రాక్‌లో అదరగొట్టారు. ఐటెమ్ నెంబర్‌గా తెరకెక్కిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. బి.అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ‘మజాకో మల్లికా’ అనే ట్రాక్‌ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. ఈ సినిమా మే 14న భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు.
ఇంతకు ముందు విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్టంట్ సన్నివేశాలు అలరించాయి. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పుష్ప ఫేమ్ రాజ్ తరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓంగ్-బాక్ సిరీస్‌కు ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయంగా ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ తన బృందంతో కలిసి థాయిలాండ్‌లో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. ఓంగ్-బాక్ చిత్రాల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రసిద్ధ ఏనుగు ‘పాంగ్’ కూడా ఈ చిత్రంలో భాగమైంది అని చిత్రయూనిట్ తెలిపింది.
పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



