Wednesday, March 4, 2026
E-PAPER
Homeసినిమాతరాల పాటు గుర్తుండిపోయే పాట

తరాల పాటు గుర్తుండిపోయే పాట

- Advertisement -

హీరో రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సెకండ్‌ సింగిల్‌ ‘రై రై రా రా’ పాట దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
రికార్డింగ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌తో టాప్‌ వన్‌లో ట్రెండ్‌ అవుతోంది.
రామ్‌చరణ్‌ గ్రేస్‌, చరిష్మా, ఎలక్ట్రి ఫైయింగ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ అందరినీ అలరిస్తున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్‌, అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌, జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్‌ వైరల్‌ హిట్‌గా అదరగొట్టింది.
వద్ధి సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్‌ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘రై రై రా రా’ పాట విశేషాలు పంచుకున్నారు లిరిక్‌ రైటర్‌ అనంత శ్రీరామ్‌.
రామ్‌ చరణ్‌ రుద్రతాండవం, ఏఆర్‌ రెహమాన్‌ ధీర శంఖారావం, రత్నవేలు చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్‌ బాగున్నాయి, ఫలానా లైన్‌ విను, ఫలానా లైన్‌ బాగుంది అని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట ఆ అదష్టాన్ని చేసుకుందనిపించింది.
నిజానికి ఇది ఒక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్‌ కాదు అయినప్పటికీ కూడా లైన్స్‌ గురించి మాట్లాడుతున్నారు.. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. మేమిద్దరం నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది. ఈ తరానికి ముందు తరానికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూనే మాస్‌ని అలరించేలా ఈ పాటని రూపొందించడం జరిగింది.
ఈ పాట రాయడానికి చాలా వెర్షన్స్‌ అనుకున్నాం. ఫైనల్‌గా ఒక మంచి ప్రబోధాత్మక పాట గానే ఉండాలి అని నిర్ణయించాం. కాకపోతే ఇందులోనే వాడే భాష జనానికి దూరంగా ఉండకూడదు. వ్యవహారికంగా ఉండాలి. చెప్పే విషయం చాలా లోతుగా ఉండాలి అని బుచ్చిబాబు చెప్పారు.
షూటింగ్‌ లోకేషన్‌లో ఈ పాటను చరణ్‌కి వినిపించాను. పాట విని నన్ను హత్తుకున్నారు. నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భము రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని చెప్తుంటాను. ఆ లక్షణం ఈ పాటకి కనిపిస్తోంది.
ఒక నిర్మాతగా సతీష్‌ తన బాధ్యతని 100% స్వచ్ఛంగా నిర్వర్తించారు. అందుకే ఇంత మంచి ఫలితం వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -