Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమ్మక్క-సారలమ్మ ఆవరణలో నాగేంద్రుడు ప్రతిమ లభ్యం

సమ్మక్క-సారలమ్మ ఆవరణలో నాగేంద్రుడు ప్రతిమ లభ్యం

- Advertisement -

చూసేందుకు జనం క్యూ..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని దుబ్బపేట గ్రామపరిదిలోని పంటపొలాల్లో సమ్మక్క-సారలమ్మ గద్దెల ఆవరణలో నాగేంద్రుడు ప్రతిమ బయటపడింది. ఇది బంగారుది.. లేదు వెండిది.. కాదు పంచాలోహం కావచ్చని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. దీని బరువు సుమారుగా 100 నుంచి 200 గ్రాములు ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

అయితే చిన్నతూండ్ల గ్రామానికి చెందింన కోట శిరిషకు రెండు రోజులుగా నాగేoద్రుడు పూనకమైనట్లుగా తెలిపారు. ఆమె చిన్నతూండ్ల నుంచి నడిసి వచ్చి పునకంతో ఊగుతూ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నేలపై బోర్లుతూ ఇక్కడ నాగేoద్రుడు విగ్రహం ఉందని చెప్పారని వివరించారు. ఆమె భర్తతోపాటు పలువురు కొద్దిపాటి మట్టితియగా నాగేoద్రుడు ప్రతిమతోపాటు చిన్నపాటి జవాజి దసంగం డబ్బా లభించిందని తెలిపారు. నాగేంద్రుడు ప్రతిమ బయటపడిందనే సమాచారం తెలియగానే తాడిచెర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ల గ్రామస్తులతో పాటు కొయ్యుర్ పోలీసులు సైతం పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -