Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నిషేద పోరాటంలో ఒక అడుగు ముందుకు

ప్లాస్టిక్ నిషేద పోరాటంలో ఒక అడుగు ముందుకు

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మండలంలోని బంగారిగడ్డ  గ్రామంలో ప్లాస్టిక్ నిషేధానికి ఒక అడుగు ముందుకు వేశారు. మంగళవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ ఎండి మహబూబ్  తండ్రి కాసిం  జ్ఞాపకార్ధంగా  500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు గ్రామ సర్పంచ్  బోయపల్లి సునీత కు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థులు అందరూ ఇంట్లో జరిగే శుభాకార్యలకు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసు లు వాడకుండా వీటిని సద్వినియోగం చేసుకొని గ్రామంలో ప్లాస్టిక్ నీషేదానికి తోడుపడాలని, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ వార్డు సభ్యులు పంచాయతి కార్యదర్శి కోటి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -