‘కిష్కింధపురి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం ఇప్పుడు తమ 4వ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం నీటితో తడిసి, రక్తపు మరకలతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఒక చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని, మరో చేతిలో మండుతున్న ముసుగు, అతని వెనుక మెరిసే కళ్ళు భారీ కోరలతో ఉన్న ఒక పెద్ద వరాహం కనిపించడం ఇంటన్సిటీని మరింత పెంచింది.
సినిమా నిర్మాణంలో 70% పూర్తయిందని నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కువ భాగం కథలోని మిస్టరీని, డ్రామాటిక్ టెన్షన్‌ను బలంగా నిలబెట్టే కీలక సన్నివేశాలకు కేటాయించారు. ఈ సినిమా కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక.
దశావతార ఆలయం చుట్టూ తిరిగే కథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


