ప్రియదర్శి నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. ఆనంది హీరోయిన్‌గా, సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్‌రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మీడియాతో సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు. ‘ప్రేమలో రెండు భాగాలు ఉంటాయి. మన కవులు, గొప్ప, గొప్ప దర్శకులు ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పారు.. చూపించారు. అదంతా థియరీ. అయితే మనకి ప్రేమ తాలూకా అప్లికేషన్ కూడా అర్థం కావాలి. అది ఎక్కువసార్లు పెళ్లి ద్వారానే అర్థమవుతుంది.
మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారుతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అను కోవడం దగ్గరనుంచి ఇలా కూడా ఉంటుందని ఇందులో చూపించడం జరుగుతుంది. సినిమా అందరూ రిలేట్ చేసు కునేలా ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. ఆనంది అద్భుతమైన పెర్ఫార్మర్. సుమతో వర్క్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు నవనీత్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. కథని అద్భుతంగా రాశాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘అసమర్ధుడు’, థ్రిల్లర్ జోనర్‌లో ‘సుయోధన’ చేస్తున్నాను’ అని ప్రియదర్శి చెప్పారు.
అందరూ రిలేట్ చేసుకునే కథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



