Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంచి కాన్సెప్ట్‌ ఉన్న కథ

మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథ

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌ రాజు, హీరో ఆనంద్‌ దేవరకొండ అతిథులుగా విచ్చేసి, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ఇదొక ఫ్యూర్‌ లవ్‌ స్టోరీ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తో పాటు ఒక చిన్న సోషల్‌ ఇష్యూని కూడా జతచేసి రూపొందించాం’ అని తెలిపారు. ‘మీ అందరికీ నచ్చేలా మూవీ ఉంటుంది’ అని ప్రొడ్యూసర్‌ నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి చెప్పారు.

మరో ప్రొడ్యూసర్‌ మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ,’మంచి కాన్సెప్ట్‌ ఉన్న క్యూట్‌ మూవీ ఇది. ఒక కాన్సెప్ట్‌ మూవీకి ఏం కావాలో అవన్నీ చేశాం. ట్రైలర్‌తో మా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలిసే ఉంటుంది. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ‘ఇందులో నేను కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటించాను. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్‌కు థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ చాందినీ చౌదరి చెప్పారు. హీరో విక్రాంత్‌ మాట్లాడుతూ,’చైతన్య అనే సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ క్యారెక్టర్‌లో నటించాను. ఇందులో మేల్‌ ఫెర్టిలిటీ అనే కొత్త విషయం ఉంది, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌, చివరలో ఎమోషన్స్‌ ఉన్నాయి. ఒక మంచి మెసేజ్‌ కూడా ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -