Friday, March 20, 2026
E-PAPER
Homeకవితచలి రాసిన కథ

చలి రాసిన కథ

- Advertisement -

రాతిరి చెవిలో కథ చెప్పిన చలి తెల్లవార్లు
తిష్ట వేసుకుని కూర్చుంది
చలి రాకాసి చండ్రకోల దెబ్బలకి కారంలో
దొర్లిన చర్మం ఆయింట్మెంట్‌ ను హత్తుకుంది
నాజూకైన నందివర్ధనం రంగవల్లికను అద్దాలనుకొని
నైటింగేల్‌ రెక్కలపై ప్రయాణం కట్టింది
టులిప్‌ పుష్పాలు అందాన్ని
చుడిదార్‌ లా చుట్టుకొని
చిలుకను పరిణయం ఆడాయి
విచ్చుకున్న మబ్బులవర్ణాన్ని ఆత్రంగా
తుమ్మెద తాగింది
శబ్దించిన పల్లవి నిశ్శబ్దాన్ని
నిటారుగా నిలబడి గుంజీళ్ళు తీయించింది
– రాధ తాళ్లూరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -