నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని మారుమూల గ్రామమైన కోనాపూర్ గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రాళ్లవాగు మత్తడు దూకుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగో ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వర్షపు నీరు రాళ్ల వాగు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి జల సోయగం సంతరించుకుంది. రాళ్ల వాగు శుక్రవారం తెల్లవారుజాము నుండి మత్తడి దూకడం ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండడంతో సెలవు రోజుల్లో ప్రాజెక్టుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఆస్కారం ఉంది.
మత్తడి దూకుతున్న రాళ్ల వాగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES