హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో రాబోతున్న చిత్రం ‘మిరాయ్’. ఇందులో సూపర్ యోధగా తేజ సజ్జా అలరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తేజ సజ్జ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో తేజ సూపర్ యోధ అవతార్‌ని అదిరిపోయేలా చూపించారు. మిరారు మైండ్ బ్లోయింగ్ టీజర్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ హిట్ అయ్యింది. ఫస్ట్ సాంగ్‌లో వైబ్ ఉండటంతో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో రీతికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రీయా శరన్, జయరాం, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించ నున్నారు. నార్త్ రిలీజ్‌కి బూస్టప్ ఇస్తూ బాలీవుడ్ టాప్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్ర హిందీ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేస్తున్నారు. 2డీ, 3డీ ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఓ సూపర్ యోధ కథ
- Advertisement -
- Advertisement -