దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కతిక అంశాలు ఉన్నాయి.
ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘సుర సుర’ (తెలుగు)ను ఈనెల 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
‘సుర సుర’ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమా లో ఒక మెయిన్ హైలెట్‌గా నిలవనుంది.
ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, ఫోక్ ఎలి మెంట్స్‌ను సినిమాటిక్ ఆర్కెస్ట్రేషన్‌తో కలిపి ఫెస్టివ్ సాంగ్‌గా తీర్చిదిద్దారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ తీసుకురానుంది.
అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు వోకల్స్ అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్ తదితరులు ముఖ్యతారాగణం.
సంప్రదాయ పెళ్ళి సంబరాల పాట..
- Advertisement -
- Advertisement -



