Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి పన్ను పేరుతో కుచ్చు టోపీ..

ఇంటి పన్ను పేరుతో కుచ్చు టోపీ..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో గ్రామపంచాయతీ అధికారుల లీలలు ఆలస్యంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంటి పన్ను పేరుతో గ్రామస్తుల వద్ద నుండి లక్షల రూపాయలు గ్రామపంచాయతీ అధికారులు స్వాహా చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. రికార్డుల్లో నమోదు చేయకుండా కేవలం రిసిప్ట్ మాత్రమే ఇచ్చి ఇంటి పన్ను భారీగా వసూలు చేశారని అంటున్నారు. 2020 నుండి 21 కి గాను ఒక్కొక్క ఇంటికి సుమారు 6వేల నుండి పదివేల రూపాయల వరకు వసూలు చేసినట్టుతెలుస్తోంది.ఇంత మొత్తంలో ఇంటి పన్ను మున్సిపాలిటీ లో కూడా లేకపోవడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. అప్పటి కార్యదర్శి, సర్పంచి ఆధ్వర్యంలో ఈ ఇంటి పన్ను సేకరణ జరిగినట్టు స్థానికులు తెలిపారు. గ్రామంలోని సుమారు గా 200 నుండి 300 మంది ఇంటి యజమానుల వద్ద నుండి భారీ మొత్తంలో ఇంటి పన్ను వసూలు చేసి రికార్డులో నమోదు చేయకుండా లక్షల రూపాయలు గ్రామపంచాయతీ నిధులను స్వాహా చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సల్ల శేఖర్ రెడ్డి బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గత నెల ఆర్టిఐ ద్వారా అధికారులను వివరణ కోరగా అందులో కేవలం కొన్ని రిసిప్ట్ లు మాత్రమే రికార్డుల్లో నమోదు చేశారని, మిగతా రిసిప్ట్ లు రిజిస్టర్ లో నమోదు చేయకుండా డబ్బులు స్వాహా అయినట్టు ఆర్టిఏ లో బయటపడిందని ఆయన తెలిపారు. దీనిపై ప్రస్తుత కార్యదర్శి బీరెల్లి కర్ణాకర్ ను వివరణ కోరగా 2020-21 సంవత్సరానికి గాను 3,26,000 రూపాయలు ఇంటి పన్ను రికార్డులో పేర్కొన్నట్టు తెలిపారు. దీనిపై ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టి గ్రామపంచాయతీ ఇంటి పన్ను నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -