Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ బలరాం నాయక్ కు ఘన స్వాగతం 

ఎంపీ బలరాం నాయక్ కు ఘన స్వాగతం 

- Advertisement -

మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ మహబూబాద్ కి వెళ్తున్న తరుణంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపినట్లు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున బలరాం నాయక్ కి పేద ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.

పేద ప్రజలను గత పాలకులు పట్టించుకున్న నాదిలే కరువయ్యారని తెలిపారు. కోట్లాది నిధులు తీసుకొచ్చి పార్లమెంటు పరిధిలో అనేక రంగాలుగా అభివృద్ధి పరుస్తున్న వ్యక్తి అంటే అది మన ఎంపీ బలరాం నాయక్ అని అన్నారు. ఈ సందర్భంగా మండలంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీనికి ఎంపీ బలరాం నాయక్ సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గమే లక్ష్యమని అన్నారని అన్నారు. జేఎన్ టు యు అధ్యక్షులు ఆకుల నాగన్న వరిపల్లి ఉప్పలయ్య పులి శ్రీను హెచ్ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -