కేటీఆర్‌తో సహ ఐదుగురిపై అభియోగాలు నమోదు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనంరేపిన ఫార్ములా ఈ కారు రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) నాంపల్లి కోర్టులో సోమవారం నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో ఏ-1గా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును, ఏ-2 నిందితుడిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్‌ఎండీఏ మాజీ సీఈఓ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ-4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్‌మల్లేశ్వర్‌రావుు, ఏ-5గా లండన్‌లోని ఎఫ్‌ఈఓ డైరెక్టర్ ను నిందితులుగా ఏసీబీ పేర్కొంది. దాదాపు ఏడాది కాలంగా ఫార్ములా ఈ కారు కేసును దర్యాప్తు జరిపిన ఏసీబీ అధికారులు మొత్తం రూ.55 కోట్లను నిబంధనలకు విరుధంగా విదేశీ కంపెనీకి దారి మళ్లించారని అభియోగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కారు రేస్ నిర్వహణకు సంబంధించి ముందుగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవడంగానీ, నిధులను విదేశాలకు మళ్లించే విషయంలో ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడంగానీ నిందితులు చేయలేదని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్‌తో సహా ఐదుగురు నిందితులను ఏసీబీ విచారించింది. ఈ కేసులో మనీల్యాండరింగ్ కూడా జరిగినట్టు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో వైపు దర్యాప్తు సాగిస్తున్నది. మొత్తానికి ఈ కేసులో చార్జిషీట్ వేయడానికి సమయం తీసుకున్న ఏసీబీ చివరికి అభియోగాలతో పాటు ఆధారాలతో ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



